కామారెడ్డి పట్టణంలో గురువారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కళాశాలల బంద్ విజయవంతమైంది. పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలని, ఫీజుల బకాయిలను తక్షణమే చెల్లించాలని జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు డిమాండ్ చేశారు. ప్రైవేట్ కళాశాలలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయని, ప్రభుత్వ కళాశాలలను బంద్ చేయించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.