ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బైక్.. ముగ్గురు మృతి

కామారెడ్డి జిల్లాలో మద్నూర్ మండలం మేనూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులు పెద్ద ఎక్లార గ్రామానికి చెందిన నాగు (48), సచిన్ (17), అశోక్ (21)గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్