ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరు

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ, జిల్లా ఉపాధ్యక్షులు అంకన్న నాగరాజ్ గౌడ్ నేతృత్వంలో, టీపీసీసీ ఆదేశాల మేరకు, ఓటు హక్కు పరిరక్షణ కోసం పోరుబాట నిర్వహించనుంది. ఈ నిరసన కార్యక్రమం 28న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుండి ర్యాలీగా వెళ్లి, జిల్లా కలెక్టరేట్ ముందు ఉదయం 10:30 గంటలకు జరగనుంది. ఈ సందర్భంగా నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ, "ఓట్ల చోరీ" వ్యవహారంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవస్థ వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ, ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕