ఉమ్మడి మాచారెడ్డి మండల మాజీ జడ్పీటీసీ, కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్‌పర్సన్ గ్యార లక్ష్మి సోమవారం (మార్చి 30) ఉదయం 10 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. వారం రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. ఇటీవల ఆమె కూతురు గ్యార అఖిల కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ గా గెలుపొందారు. ఆమె మృతితో పోతారం, మాచారెడ్డి మండలం, కామారెడ్డి జిల్లా కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మంగళవారం ఆమె స్వగ్రామమైన పోతారంలో అంత్యక్రియలు జరగనున్నాయి.