కామారెడ్డి: కారును ఢీకొన్న కంటైనర్

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం సిద్ధ రామేశ్వర్నగర్ గ్రామ సమీపంలోని 44వ హైవేపై ఆదివారం, వేగంగా వస్తున్న కంటైనర్ లారీ కారును వెనకాల నుంచి ఢీకొట్టింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన సృజన్ మోహన్ రెడ్డి-పద్మ దంపతులు కారులో హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారును లారీ కొద్ది దూరం ఈడ్చుకెళ్లినా, భార్యాభర్తలు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు వారిని బయటకు తీయడంతో ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కారును పోలీస్ స్టేషన్కు తరలించి, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్