కామారెడ్డి: గ్రామసభలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం

కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామంలో గొల్ల రాములు అనే వృద్ధుడు, తనకు వస్తున్న పెన్షన్ నిలిచిపోవడంతో మనస్థాపానికి గురై చెట్టెక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా పెన్షన్ మంజూరు కాకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామ పాలకవర్గ సభ్యులు వెంటనే స్పందించి అతడిని కాపాడి, పెన్షన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన గ్రామసభ ప్రాంగణంలో కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్