రోడ్డు పక్కన పడి ఉన్న టాటా ఏస్ వాహనాన్ని గమనిస్తూ బైకు నడుపుతూ ముందుకు వెళ్తుండగా భారీ వాహనాన్ని ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సదాశివనగర్ మండలం దగ్గి ప్రాంతంలో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన మంజూరు హుస్సేన్ (47) అనే వ్యక్తి శనివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై నుంచి నిజామాబాద్ వైపు వెళుతుండగా దగ్గి దర్గా దాటిన తర్వాత ఈ సంఘటన జరిగింది.