కామారెడ్డి: కడుపు నొప్పి భరించలేక ఉద్యోగి ఆత్మహత్య

కామారెడ్డి జిల్లా బైరాపూర్​లో నీటి పారుదల శాఖ ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బైరాపురం గ్రామానికి చెందిన పందుల సాయిలు (48) నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటర్ 20 నెంబర్ కాలువపై లష్కర్​గా గత మూడేళ్ల నుంచి పని చేస్తున్నారు. గది కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నారు. 3 రోజుల నుంచి నొప్పి తీవ్రం కావడంతో శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయిలు భార్య సైతం మూడేళ్ల కిందట ఆత్మహత్య చేసుకుంది. దీంతో అతడి ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు.

సంబంధిత పోస్ట్