లింగంపేట్ మండలం కోమటిపల్లి గ్రామంలో మానసిక స్థితి సరిగా లేని ధరణి నవీన్ (18) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. మంగళవారం ఉదయం గ్రామస్తుడు గంపల తిరుపతి నవీన్ చెప్పులను చెరువు కట్టపై గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. చెరువులో గాలించగా మృతదేహం లభ్యమైంది. ప్రాథమిక విచారణలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు కాలుజారి నీటిలో పడి మరణించినట్లు తేలింది. కుమారుడి మృతిపై అనుమానాలు లేవని తల్లి తెలపడంతో, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.