కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం

రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట స్కూల్ తండా అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం ఓ ఆవుపై దాడి చేసి చంపగా, ఆదివారం మరో ఆవుపై దాడి జరిగింది. చనిపోయిన ఆవుపై విషం చల్లినట్లు అనుమానంతో ఫారెస్ట్ అధికారులు వెటర్నరీతో కలిసి కళేబారాన్ని పరిశీలించి శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్