ఇంజెక్షన్లు ఇవ్వడంతో వ్యక్తి మృతి!

పిట్లంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన కే.సాయిలు అనే వ్యక్తి మృతి చెందడంతో ఉద్రిక్తత నెలకొంది. నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావుపల్లికి చెందిన సాయిలు జ్వరంతో ఆసుపత్రికి వచ్చారని, వైద్యులు రెండు ఇంజెక్షన్లు ఇచ్చిన తర్వాత మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతికి గల కారణాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తూ వారు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్