భిక్కనూరులో రోడ్డు ప్రమాదం: కారు ఢీకొని వృద్ధుడు మృతి

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన లింగరాజు రామస్వామి (58) 44వ హైవేపై డివైడర్ దాటుతుండగా, హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కూలి పని చేసుకునే రామస్వామి అక్కడికక్కడే మృతి చెందారు. భిక్కనూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్