వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం వడ్డేపల్లి గ్రామంలో కుంటోళ్ల సాయిలు (50) అనే వ్యక్తి తల్లి అనారోగ్యం, ప్రేమ వివాహం తర్వాత ఉద్యోగం లేకపోవడం వల్ల కుటుంబంపై పెరిగిన ఆర్థిక భారం కారణంగా తీవ్ర మనస్థాపానికి గురై పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కుమారుడు మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్