బీబీపేటలో అనుమతి లేకుండా గణేష్ నిమజ్జన కార్యక్రమానికి డీజే సౌండ్ బాక్సులు తరలిస్తున్న ఒక టాటా ఏస్ వాహనాన్ని పోలీసులు మంగళవారం రాత్రి 9:30 గంటలకు సీజ్ చేశారు. ముదిరాజ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి ఈ వాహనం వెళ్తున్నట్లు గుర్తించారు. వాహనాన్ని సీజ్ చేసి, తదుపరి చర్యలు చేపట్టారు.