నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని 50 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. ఈనెల 22న అపస్మారక స్థితిలో కనుగొనబడి, ఆసుపత్రిలో చేర్పించబడిన ఆయన, 25న మరణించారు. వన్ టౌన్ SHO రఘుపతి ఈ విషయాన్ని బుధవారం తెలిపారు. మృతుడి బంధువులు ఎవరైనా ఉంటే వన్ టౌన్ పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.