ఆలూర్ మండలం కల్లెడిచిన్నాపూర్ అడవిలో చిరుత పులి సంచారం ఉన్నట్లు సమాచారం రావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత కొద్ది రోజులుగా అడవిలో పులి సంచారం ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ ఆఫీసర్ సుశీల్ కుమార్ ఘటన స్థలానికి చేరుకుని అడవిలో కాళీ అడుగులను పరిశీలించారు. స్పష్టమైన పులి కాళీ ముద్రలు లభించలేదని ఆయన తెలిపారు. అయినప్పటికీ, గ్రామస్తులు మాత్రం పులి సంచారం నిజమేనని, అనుమానాస్పద కదలికలు కనిపించాయని పేర్కొంటున్నారు.