నిజామాబాద్: వ్యభిచార గృహంపై పోలీసులు మెరుపు దాడి

ఇందూరు నగర కార్పొరేషన్ శివారులోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీ ప్రియనగర్ కాలనీలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సిసిఎస్ పోలీస్ బృందం ఈ దాడులు నిర్వహించింది. ఈ దాడిలో ముగ్గురు విటురాళ్లు, ఇద్దరు విటులు, 6 మొబైల్ ఫోన్లు, రూ.33,010 నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చర్యల కోసం రూరల్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు.

సంబంధిత పోస్ట్