ఇంజనీరింగ్ విద్యా రంగంలో తెలంగాణ మరో ముందడుగు వేసింది. తెలంగాణ విశ్వవిద్యాలయానికి బీటెక్ కళాశాల మంజూరు చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని తొలి ప్రభుత్వ బీటెక్ కళాశాల కావడం గర్వకారణం. ఇప్పటివరకు ప్రైవేట్ కళాశాలకే పరిమితమైన ఇంజనీరింగ్ విద్య ఇప్పుడు ప్రభుత్వ స్థాయిలో అందుబాటులోకి రానుంది. సాంకేతిక విద్యను స్వస్థలంలోనే అభ్యసించే అవకాశం స్థానిక యువతకు లభించనుంది. తక్కువ ఖర్చుతో ఉత్తమ విద్యను అందించే దిశగా ఈ కళాశాల దోహదం చేస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.