నిజామాబాద్ కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎన్జెడీ పోలీస్ ఇంటలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఏఎస్ఐ భీమారావు భార్య భవాని మరణించారు. భవాని తన కుమారుడితో కలిసి బాసర అమ్మవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా, బైక్‌కు ఎదురుగా కుక్క రావడంతో తప్పించబోయే ప్రయత్నంలో బైక్ బోల్తా పడింది. ఈ ఘటనలో భవాని అక్కడికక్కడే మృతి చెందారు.