ఓటు హక్కు వినియోగంపై అవగాహన సదస్సు

త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో బాల్కొండ ఎస్ఐ కే. శైలేంధర్ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రభుత్వ ఖజానా నుంచి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపే శక్తి సర్పంచ్ పదవికే ఉంటుందని, అలాంటి పదవికి అర్హుడైన అభ్యర్థిని ఎన్నుకొని గ్రామ అభివృద్ధి కోసం ఓటు హక్కును వినియోగించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్