వీధికుక్క దాడి బాలుడికి గాయాలు

డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం వీధికుక్క దాడిలో మగ్గిడి సాయి హర్షిత్ అనే బాలుడు గాయపడ్డాడు. బాలుడి అరుపులు విని తల్లిదండ్రులు బయటకు వచ్చి కుక్కను తరిమివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గాయపడిన బాలుడికి చికిత్స అందించారు. గతంలో కూడా ఇదే గ్రామంలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేసి లేగదూడలను, గ్రామస్తులను కరివించిన ఘటనలు చోటుచేసుకున్నాయని గ్రామస్తులు తెలిపారు.

సంబంధిత పోస్ట్