ధర్పల్లి మండల కేంద్రంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వ్యవసాయ మోటార్ల కేబుల్ వైర్లను దొంగిలించారు. అన్సాన్పల్లి ఫీడర్ పరిధిలోని సుమారు 20 మంది రైతుల కేబుళ్లను ఎత్తుకెళ్లడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనతో వ్యవసాయ పనులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది.