చైన్ స్నాచింగ్

సిరికొండ మండలంలోని గడ్కోల్ సమీపంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న పెండ్లి బుచ్చవ్వ అనే మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి 3 తులాల పుస్తెల తాడును లాక్కొని పారిపోయినట్లు ఎస్సై జాడీ రామకృష్ణ తెలిపారు. పూసలతండా రోడ్డు వెంబడి శ్రీరామకుంట సమీపంలో తన పొలంలో పని చేసుకుంటుండగా, అనుమానాస్పదంగా వచ్చిన వ్యక్తి పుస్తెల తాడును లాక్కొని పారిపోయాడని బుచ్చవ్వ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్