అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది: ఎమ్మెల్యే

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఇటీవల అకాల వర్షంతో నష్టపోయిన ప్రతి రైతును కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. గురువారం డిమ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో రైతుల పంట పొలాలను పరిశీలించిన ఆయన, నష్టపోయిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. అధైర్యపడొద్దని, కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అని అన్నారు. అనంతరం వ్యవసాయ, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్