శుక్రవారం ఉదయం పడకల్ శివారులోని తిరుమలయ్య చెరువు వద్ద ట్రాక్టర్ ను తరలించే క్రమంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి తలారి నరేందర్ (35) అనే యువకుడు మృతిచెందాడు. ట్రాక్టర్ ను ఆపడానికి ప్రయత్నించగా కాలు జారి కింద పడటంతో వెనుక టైర్లు అతని కాళ్లపై నుంచి వెళ్లాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నరేందర్ మృతి చెందాడు . భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.