ధర్పల్లి:మండల స్థాయి ప్రజావాణికి మూడు దరఖాస్తులు

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుండి మూడు దరఖాస్తులు అందాయి. వీటిలో రెవెన్యూ, విద్యా, అటవీ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు వచ్చాయని ఎమ్మార్వో టి శాంత, ఎంపీడీవో మారుతి తెలిపారు. ఈ దరఖాస్తులను పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు పంపించినట్లు మండల అధికారి మారుతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శాంత, ఎంపీడీవో మారుతి, హౌసింగ్ ఏఈ హర్షత, వ్యవసాయ అధికారి వెంకటేష్, ఉపాధ్యాయులు, మండల స్థాయి అధికారులు G. గంగాధర్ హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్

✕
✕