నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని వాడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్ట గంగ మోహన్ విద్యార్థులకు దుస్తులను అందజేసి, క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు, యువకులు, పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.