కుక్కలదాడి.. 9 మందికి గాయాలు

జక్రాన్పల్లి మండల కేంద్రంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. సోమవారం తొమ్మిది మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఆదివారం ఓ బాలుడిపై దాడి చేయగా, అతన్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. రెండు రోజులుగా వరుసగా జరుగుతున్న ఈ దాడులతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి కుక్కల బెడదను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్