రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా

ఇందల్వాయి సొసైటీ తిర్మన్పల్లి ఎరువుల గోదాంను అధికారులు బుధవారం పరిశీలించారు. యూరియా అమ్మకాలు, నిల్వ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిచ్పిల్లి, ఇతర గోదాంలను తనిఖీ చేశారు. ఎరువుల విక్రయాలు ఈపాస్ మిషన్ ద్వారానే జరపాలని, కొత్తగా తీసుకొచ్చిన యూరియా యాప్ పై రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఐదు జిల్లాల్లో మాత్రమే యాప్ ద్వారా యూరియా సరఫరా జరుగుతోందని, త్వరలో రాష్ట్రమంతా ఇదే పద్ధతిలో విక్రయాలు కొనసాగుతాయని తెలిపారు. రైతులు అసత్య ప్రచారాలను నమ్మి కృత్రిమ కొరత సృష్టించవద్దని కోరారు. ఈ తనిఖీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, వ్యవసాయ అధికారులు, సొసైటీ కార్యదర్శులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్