తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో శుక్రవారం డిగ్రీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు 7189 మంది విద్యార్థులకు గానూ 6709 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 829 మంది విద్యార్థులకు గానూ 724 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని తెయూ రిజిస్ట్రార్ యాదగిరి, కంట్రోలర్ సంపత్ కుమార్, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్ తనిఖీ చేశారు.