పిడుగుపాటుకు రైతు మృతి

ధర్పల్లి మండలంలోని కార్నల్ తండాకు చెందిన దారావత్ దేవిసింగ్ (50) అనే రైతు ఆదివారం రాత్రి ఉరుములతో కూడిన వర్షంలో తన పొలం వద్దకు వెళ్లగా పిడుగుపాటుకు గురై మృతి చెందినట్లు ఎస్సై సందీప్ సోమవారం తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు పిడుగులు పడే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై సూచించారు.

సంబంధిత పోస్ట్