నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ రూరల్ పరిధిలోని సిరికొండ మండలం గ్రామపంచాయతీ ఆవరణలో ఓటర్ల అవగాహన కొరకు సోమవారం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. భారత ఎన్నికల సంఘం అధికారి సూచనల మేరకు, 2026 సమగ్ర సవరణలో భాగంగా నిజామాబాద్ గ్రామీణ శాసనసభ నియోజకవర్గంలోని ఓటర్లు తమ మ్యాపింగ్ పూర్తి చేయాలని అధికారులు తెలిపారు. BLOల విధులు, ఓటర్లు చేయాల్సిన పనులు, అదనపు అవగాహన అంశాలు ఫ్లెక్సీలో పొందుపరిచారు. Voters.ecl.gov.in, Ceotelangana.eci.gov.in వెబ్‌సైట్లలో వివరాలు తెలుసుకోవచ్చు.