బాల్కొండలో ఉచిత కంటి వైద్య శిబిరం: 30 మందికి పరీక్షలు

బాల్కొండ మండలం కిసాన్ నగర్ లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 30 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, వారిలో మోతి బిందు ఉన్నవారిని గుర్తించి శస్త్ర చికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు రామ్ రాజ్ గౌడ్, లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకు లింగం, జోనల్ చైర్మన్ జ్ఞాన సాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, కోశాధికారి వంశీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్