ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం

సిరికొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, కృష్ణ హోటల్ MD గాదె కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో న్యూరో సర్జన్ డాక్టర్ రామనేశ్వర్, ఎండీ ఫిజిషియన్ డాక్టర్ లక్ష్మి రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సతీష్, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ మోసిన్, పల్మనాలజిస్ట్ డాక్టర్ మోహన్, సర్జన్ డాక్టర్ జయ ప్రకాష్ సింగ్, క్రిటికల్ కేర్ అనస్థీసియా స్పెషలిస్ట్ డాక్టర్ విఠల్ వంటి నిష్ణాతులైన వైద్యులు సేవలు అందించారు.

సంబంధిత పోస్ట్