సిరికొండ, మైలారం గ్రామశివారులో జూదం ఆడుతున్న అడ్డాపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 1,810 నగదును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు సిరికొండ ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.