ధర్పల్లిలో గ్రామ సభ

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని వాడి గ్రామంలో గ్రామ పంచాయతీ నందు సర్పంచ్ కట్ట గంగమోహన్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభ లో మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి పనుల కోసం తీర్మానాలు చేయడం జరిగింది. ఈ గ్రామసభలో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, డ్రైనేజీ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్ట గంగ మోహన్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు, గ్రామ ప్రజలు, నాయకులు, గ్రామ సెక్రెటరీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕