నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి, గురువారం డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఈ నెల 4వ తేదీన కురిసిన వర్షాల వల్ల నియోజకవర్గంలోని పంటలు తీవ్రంగా నష్టపోయాయని తెలిపారు. రైతులకు అధైర్యపడవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.