టీయూ అంబేద్కర్ సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 9న నిర్వహించనున్న మహనీయుల జయంతి ఉత్సవాల బ్రోచర్‌ను మంగళవారం వైస్ ఛాన్సలర్ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సాధన సమితి కన్వీనర్ అశ్విత్ మాట్లాడుతూ, విద్యార్థులు మహనీయుల అడుగుజాడల్లో పోరాటాలను ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాలని, జ్యోతిబాఫూలే, అంబేద్కర్ వంటి వారి ఆశయాలను కాపాడాలని సూచించారు.