లారీ - డీసీఎం ఢీ.. ఒకరు మృతి

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి శివారులోని 44వ నంబరు జాతీయ రహదారిపై డీసీఎం, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, సహాయకుడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. కల్వర్టు నిర్మాణ పనుల వల్ల వాహనాల రాకపోకలను ఒక వైపు నుంచే అనుమతిస్తుండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇదే ప్రాంతంలో పలు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕