ఎల్లారెడ్డిపల్లి లో ఘోర అగ్నిప్రమాదం

ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లె గ్రామంలో బుధవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక నివాస గృహం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. మేదరి నర్సయ్య అనే కూలీ తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. కూలి పనికి వెళ్ళిన సమయంలో, ఇంట్లో నుంచి పొగలు, మంటలు రావడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని వస్తువులన్నీ కాలిపోయాయి. బాధితులు తీవ్రంగా నష్టపోయారు.

సంబంధిత పోస్ట్