దర్పల్లి మండల కేంద్రంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చెరువు తండాకు చెందిన ముడావత్ శేఖర్ (17) మృతి చెందాడు. ధర్పల్లి శివారులోని మున్నూరుకాపు కళ్యాణ మండపం దగ్గర గడ్డి కట్టలతో వెళ్తున్న ట్రాక్టర్ను రోడ్డు మధ్యలో నిలిపారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ట్రాక్టర్ను రోడ్డుపై నిలపడంతో, వరిధాన్యం తూకం కోసం ధర్పల్లికి వస్తున్న శేఖర్ తన ద్విచక్ర వాహనంతో ట్రాక్టర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శేఖర్కు తీవ్ర గాయాలై మరణించాడు. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది.