నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని మద్దుల్ తండాలో శుక్రవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న కళ్యాణ మండపం భూమిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆర్. భూపతి రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాదె నరేష్ కోరారు. కార్యకర్తలు శుక్రవారం ఉదయం 10 గంటలకు మద్దుల్ తండాకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.