నిజామాబాద్: ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ రాలేదు: DIEO

జిల్లాలోని కొన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు 10వ తరగతి ఫలితాలు వెలువడకముందే ఇంటర్ అడ్మిషన్లు చేపడుతున్నాయని DIEO రవికుమార్ తెలిపారు. ఇంటర్ బోర్డు ఇంకా అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేయలేదని, కళాశాలల గుర్తింపు ప్రక్రియ కూడా పూర్తి కాలేదని ఆయన వెల్లడించారు. అనుమతి లేని కళాశాలల్లో చేర్చుకోవడానికి వచ్చే వారిని నమ్మవద్దని విద్యార్థులకు, తల్లిదండ్రులకు సూచించారు.

సంబంధిత పోస్ట్