బాసర గోదావరిలో నిజామాబాద్ వ్యక్తి ఆత్మహత్య

బాసర గోదావరి నదిలో నిజామాబాద్ నాందేవ్‌వాడకు చెందిన జాదవ్ జ్యోతిరామ్ అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న బాసర సీఐ దీపక్ వెంటనే పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని, గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕