నిజామాబాద్: విద్యార్థి ఆత్మహత్య.. బంధువుల ఆందోళన

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని ఏకలవ్య పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థి రామ్ చరణ్, ఉపాధ్యాయుడు మందలించాడని ఆత్మహత్య చేసుకున్నాడు. మార్చి 3న సెల్ ఫోన్ కనిపించడంతో టీచర్ కౌన్సెలింగ్ ఇచ్చారు. సాయంత్రం బాత్రూంలో తాడుతో ఉరి వేసుకున్నాడు. తోటి విద్యార్థులు గుర్తించి ప్రిన్సిపాల్‌కు తెలిపారు. ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బంధువులు ఆసుపత్రి వద్ద ధర్నా చేశారు. ఉపాధ్యాయుల ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్