నిజామాబాద్ శివారులోని సారంగాపూర్‌లో ఆదివారం రాత్రి అక్షయ్ అనే మెకానిక్‌ను ఇంట్లోకి చొరబడి గొడ్డలితో నరికి హత్య చేశారు. అదే కాలనీకి చెందిన సద్దాం అనే వ్యక్తితో ఆదివారం సాయంత్రం అక్షయ్‌కు గొడవ జరిగినట్లు స్థానికులు తెలిపారు. రాత్రి సమయంలో నిద్రిస్తున్న అక్షయ్‌ను సద్దాం హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.