గంజాయి వద్దు వాలీబాల్ ముద్దు

సిరికొండ మండలంలోని కొండాపూర్ గ్రామంలో వాలీబాల్ సీజన్ 2 లీక్ 2026 క్రీడలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత గంజాయి వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, వాలీబాల్ వంటి క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి దోహదపడతాయని అన్నారు. క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటే యువత ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్