మోపాల్: బైక్ దొంగతనంలో ఒకరి అరెస్ట్

చెడు వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ సురేష్, ఎస్సై యాదగిరి గౌడ్ శుక్రవారం తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీకి చెందిన భూమిగారి నవీన్, తల్లి రాజేశ్వరితో కలిసి నివాసం ఉంటున్నాడు. దొంగతనం చేసిన బైక్ లను తరలిస్తున్న క్రమంలో మోపాల్ పోలీసులకు పట్టుబడగా, నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ సురేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్