నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ రూరల్ పరిధిలోని ధర్పల్లి మండలం రామడుగు గ్రామంలో ఇందూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (ఐడిసిఎంఎస్) ఆధ్వర్యంలో గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రేడ్-ఏ రకానికి రూ. 2,461, సాధారణ రకానికి రూ. 2,441 కనీస మద్దతు ధరగా చెల్లిస్తామని నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వం సూచించిన ఏడు రకాల వడ్లు, చెత్త, రాళ్లు, మట్టి లేకుండా శుభ్రంగా ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రూ. 500 ప్రోత్సాహకం అందిస్తామని పేర్కొన్నారు.