నిజామాబాద్ జిల్లా ప్ర‌జ‌లారా జాగ్ర‌త్త‌.!

వర్షాల నేపథ్యంలో దోమల ఉద్ధృతి పెరిగింది. జూన్, జూలై నెలల్లో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు ఎక్కువగా నమోదవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. జనవరి నుండి ఇప్పటివరకు జిల్లాలో 201 మంది డెంగ్యూ చికిత్స పొందారు. నిజామాబాద్ నగరంలోనే 54 మంది డెంగ్యూతో ఆసుపత్రుల పాలయ్యారు. ఆరోగ్య శాఖ డ్రై డేలు, స్ప్రేయింగ్, ఫాగింగ్ చేస్తోంది. ప్రజలు నీటి నిల్వలు తొలగించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్